Current Bill Payment: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మళ్లీ యూపీఐ పేమెంట్స్ ను స్వీకరిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. జులై 1 నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిలో భాగంగానే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. దీంతో చాలా మంది వినియోగదారులు చెల్లింపుల విషయంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. దీంతో పరిస్థితిని తెలుసుకున్న విద్యుత్ పంపిణీ సంస్థలు..మరలా యూపీఐ చెల్లింపులను ప్రారంభించాయి.
కరెంట్ బిల్లుల చెల్లింపులను స్పీడప్ చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్,ఏపీలోని ఏపీసీపీడీసీఎల్ లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్ లోకి రావడంతో యూపీఐ సేవలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఫోన్ పే చెల్లింపులను పునరుద్దరించినట్లు విద్యుత్ ఉన్నతాధికారులు ప్రకటన చేశారు. టీజీఎస్పీడీసీఎల్ ఇప్పటికే ఫోన్ పే ద్వారా చెల్లింపులు స్వీకరిస్తోంది. మిగతా సంస్థలతోనూ చర్చలు జరుపుతుంది. త్వరలోనే గూగుల్ పే తోపాటు మరిన్ని యూపీఏ పేమెంట్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యుత్ సంస్థల తాజా నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ మాత్రమే కాకుండా..వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి కూడా బిల్లు కట్టుకోవచ్చు. హోం పేజీలో బిల్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అందులో వివరాలను నమోదు చేసి సింపుల్ గా కరెంట్ బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్ లో మాత్రమే కాదు..యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.