అమరావతి: సమర్థుడైన చంద్రబాబు మరోసారి సీఎం కావడం సంతోషదాయకమని మాజీ సీఎం, భాజపా నేత కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పారు.
కేంద్రం సాయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. ”రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయాలి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. వాటి పర్యవసానమే ఇప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.
గత ప్రభుత్వం జిల్లాలు విభజించి తప్పు చేసింది. నేను సీఎంగా ఉండి ఉంటే మళ్లీ జిల్లాలను కలిపేవాడిని. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే బ్రిజేష్కుమార్ను తప్పించాలి. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై నేను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతోంది. నదీ జలాల అంశంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది” అని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.