అమెరికాలో ఓ భారీ పేలుడు అందరినీ ఆందోళనకు గురి చేసింది. బిస్కెట్ బేసిన్లోని యెల్లోస్టోన్ జాతీయ పార్కులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భూమిలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి నీరు, మట్టి ఎగిసిపడ్డాయి.
దీంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీనిని ‘హైడ్రోథర్మల్’ పేలుడుగా అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూమి లోపల నీరు వేడెక్కి, ఆవిరిగా మారినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుందని, ఒత్తిడి పెరిగినప్పుడు ఇలా పేలుళ్లు సంభవిస్తాయని, వీటిని హైడ్రోథర్మల్ పేలుళ్లు అంటారని తెలిపింది.