ప్రభాస్ పని అయిపోయిందన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో డార్లింగ్ ముందుకు దూసుకు వస్తూనే ఉన్నాడు. కల్కి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మొదట్లో కూడా సినిమా పోయేలా ఉందన్న విమర్శలు వచ్చాయి.
తీరా సినిమా రిలీజ్ చేశాక.. అప్పుడు విమర్శించినవారే వన్స్‌మోర్ అంటూ మరోసారి కల్కి చూసేందుకు థియేటర్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ ఘనత ప్రభాస్ ఒక్కడిదే కాదు! తెర వెనక నుంచి నడిపించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ది.
కలెక్షన్ల సునామీ
అభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా కల్కి కళాఖండాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్లోనూ రికార్డులు తిరగరాస్తోంది.
హలో అమెరికా..
అమెరికా, కెనడాలోనే రూ.91 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ అక్కడి ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. హలో అమెరికా.. మేము తీసే ప్రతి సినిమాకు మీరెప్పుడూ అండగా ఉంటున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తారు. కల్కి మీ సినిమాగా భావించి సపోర్ట్ చేశారు. అందుకు థాంక్యూ సో మచ్.
ఇలాంటి చిత్రాలు అరుదుగా..
మీ ఫ్రెండ్స్, పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లండి. కల్కి వంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ! ఇప్పటికే మీలో చాలామంది కల్కి చూసి ఎంజాయ్ చేశారు. అందరికంటే ముందుగా కల్కిని సపోర్ట్ చేసినందుకు మరోసారి థాంక్యూ అని వీడియో రిలీజ్ చేశాడు.