అమెరికాలో ఉద్యోగ వృద్ధి మే నెలలో అంచనాలను అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గత నెలలో 2,72,000 ఉద్యోగాలను జోడించింది. ఏప్రిల్లో నమోదైన 1,65,000 నియామకాల కంటే మే నెలలో భారీగా పెరిగినట్లు ఆ దేశ కార్మిక శాఖ తెలిపింది.
బ్రీఫింగ్ డాట్కామ్ (briefing.com) ప్రకారం.. విశ్లేషకులు అంచనా వేసిన 1,85,000 పెరుగుదల కంటే ఇది గణనీయంగా ఎక్కువ. 2023 డిసెంబర్ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. కాగా ఉద్యోగ వృద్ధితోపాటు నిరుద్యోగం కూడా స్పల్పంగా పెరిగింది. నిరుద్యోగ రేటు 3.9 శాతం నుంచి 4.0 శాతానికి పెరిగిందని ఆ శాఖ పేర్కొంది.
అయితే వడ్డీ రేట్లను తగ్గించడానికి సరైన సమయం కావడంతో ఊహించిన దానికంటే ఎక్కువ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ గణనను క్లిష్టతరం చేస్తాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రించేందుకు డిమాండ్ తగ్గుతుందనే ఆశతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నెలల్లో రేట్లను 23 ఏళ్ల గరిష్ట స్థాయికి చేర్చింది.
ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను జోడించడంతో, ఫెడ్ రేటు కోతలను మరికొంత కాలం నిలుపుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో హెల్త్ కేర్, గవర్నమెంట్ వంటి రంగాలతో పాటు విశ్రాంతి, ఆతిథ్యం వంటి రంగాల్లో ఉపాధి పెరిగిందని కార్మిక శాఖ నివేదిక తెలిపింది.