Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది.ఈ మధ్యనే రామ్ చరణ్ మూవీలో అవకాశం వస్తే చేయనని చెప్పిసిందట.
అయితే మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో మాత్రం నటిస్తుంది.అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలి అని అనుకుంటున్నట్టు ఓ టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఆ వీడియోలో ఏముందంటే పుష్ప లో ఉ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటెం సాంగ్ చేసే సమయంలో మా కుటుంబ సభ్యులు, స్నేహితులు వద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు ఎంత వద్దని చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా నేను ఈ పాటలో నటించాను.(Samantha)
అయితే ఈ పాట ఎంతో పెద్ద హిట్ అయింది. ఇక అదే సమయంలో నా విడాకుల వార్తలు వినిపించాయి. కాబట్టి వద్దనన్నారు. కానీ నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చోవాలి. అని వారిని వ్యతిరేకించి ఆ పాట చేస్తానని ఒప్పుకున్నాను.ఇక నేను పెళ్లి జీవితంలో కూడా 100% న్యాయంగా నిజాయితీగా ఉన్నాను.
కానీ ఎక్కడ లోపం జరిగిందో మాత్రం తెలియదు..అంటూ సమంత చెప్పుకోచ్చింది. ఇక సమంత చేసిన ఐటెం సాంగ్ కి దాదాపు 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు కూడా టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపించింది. అంతేకాదు పుష్ప సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఒక కారణం సమంత ఐటెం సాంగ్ చేయడం కూడా అని అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు.(Samantha)