మెక్సికోలో దారుణం జరిగింది. సెల్ఫీలపై మోజుతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది.
మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు.ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియోను చూసిన జనం షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.