అమెరికా : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై సంతాప ప్రకటనలో అమెరికా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. రైసీ చేతులు రక్తంతో తడిచాయంటూ పరోక్షంగా అనేక హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉందని ఆరోపించింది.
‘ఇరాన్లో హక్కుల అణచివేతలో ఆయన పాత్ర ఉంది. హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలను వెనకేసుకొచ్చారు’ అని పేర్కొంది. అటు సాధారణంగా ఎవరు మరణించినా తాము సంతాపం తెలుపుతామని, అలాగే రైసీ మృతికీ సంతాపం తెలుపుతున్నాం’ అని అగ్రరాజ్య జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.