Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
అనంతరం కీలక స్టాక్స్‌లో అమ్మకాల సెగతో కొంత దిగొచ్చాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 సూచీలో పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, విప్రో, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాల్లో కదలాడాయి. ఆసియా ప్రధాన సూచీలు నేడు సానుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 82.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.4,498.92 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,562.75 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.