మాడు పగిలే ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో గాలి వానతో అలజడి రేగింది. అటు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది. తెలంగాణలోని..
మాడు పగిలే ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో గాలి వానతో అలజడి రేగింది. అటు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు.. తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలోనే.. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ.. వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసింది.
ఇక.. ఏపీలోనూ పలు జిల్లాలో వర్షం దంచి కొట్టింది. అల్లూరి జిల్లా పాడేరు, అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కర్నూలు, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, అనకాపల్లిలో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు.. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే.. వరి కల్లాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలుకురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి.