జనసేన అధినేతకు మద్దతుగా మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కమెడియన్ పృథ్వీ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు కూడా పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించారు.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారాయన. ఇందుకోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్. అక్కడి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనసేన అధినేతకు మద్దతుగా మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్‌లు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అలాగే జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కమెడియన్ పృథ్వీ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు కూడా పవన్ కు మద్దతుగా పిఠాపురంలో పర్యటించారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఒకవీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వెంటనే న్యాచురల్ స్టార్ నాని కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తాజాగా మరికొందరు టాలీవుడ్ హీరోలు ఈ జాబితాలో చేరారు. హనుమాన్ హీరో తేజ సజ్జా, రాజ్ తరుణ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న విజన్, కష్టపడుతున్న తీరును నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. కోట్ల మంది ప్రజలు ఆశిస్తున్నట్లుగా నేను కూడా ఎంతో ఆశతో ఉన్నాను. ఉజ్వల భవిష్యత్ ను అందిస్తారని, మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి’ అంటూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశాడు హీరో రాజ్ తరుణ్. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జా అయితే ‘ త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ కల్యాణ్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి’ అంటూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరోల ట్వీట్స్, పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.