ప్రస్తుత కాలంలో ఎక్కువగా అందరూ ఫేస్ చేసే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి పెరిగిపోతున్నాయి.
చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి అంత ఈజీగా తగ్గవు. చాలా కష్ట పడాలి. ఇలాంటి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ చేపలు బాగా పని చేస్తాయి.
ట్యూనా చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలే శక్తి ఉంటుంది. అదే విధంగా ట్రౌట్ ఫిష్ తినడం వల్ల కూడా బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది.
హెర్రింగ్ చేపలు కూడా శరీరంలో ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది. ఈ చేపలు తింటే శరీరానికి కావాల్సిన.. ఈపీఏ, డీహెచ్ఏను అందిస్తాయి. అంతే కాకుండా శరీరంలో వాపు సమస్యలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.
అదే విధంగా స్వార్డ్ ఫిష్, సార్డెన్ ఫిష్,మెకెరల్ ఫిష్‌లు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు చక్కగా పని చేస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్‌ను అదుపు చేస్తాయి.