Parineeti Chopra’s Husband, Raghav Chadha Undergoes Eye Surgery In UK: స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రస్తుతం లండన్‌లో ఉండి కంటికి చికిత్స పొందుతున్నారు.
అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు, ఆ తర్వాత అరెస్ట్ చేసి జైలుకెళ్లిన సమయంలో ఆప్ ఎంపీ ఒక్కసారి కూడా కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే ప్రశ్నను ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను కూడా అడిగితే తీవ్రమైన కంటి సమస్య కారణంగా రాఘవ్ చద్దా లండన్ వెళ్లాల్సి వచ్చిందని ఆప్ నేత బదులిచ్చారు. కంటి ఆపరేషన్ కోసం అక్కడికి వెళ్లారని, ఆలస్యమైతే కంటి చూపు పోయే అవకాశం ఉందని అన్నారు.
విలేకరుల సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ, రాఘవ్ చద్దా UKలో ఉన్నాడు, అతనికి కంటిలో సమస్య ఉంది, అది చాలా తీవ్రమైనదని నాకు చెప్పారని, ఆలస్యమైతే కంటి చూపు పోయేదని కూడా అన్నారు. ఎన్నికల ప్రచారానికి గైర్హాజరు కావడంపై వస్తున్న ఆరోపణలను ఖండించిన భరద్వాజ్, ‘రాఘవ్ చద్దా చికిత్స కోసం అక్కడికి వెళ్లాడు. నా శుభాకాంక్షలు అతనికి ఉన్నాయి, త్వరలోనే కోలుకుని ప్రచారంలో పాల్గొంటారు అని పేర్కొన్నాడు. గత నెలలో రాఘవ్ చద్దా బ్రిటన్ పర్యటన వివాదంలో చిక్కుకుంది, ఖలిస్తాన్ వేర్పాటువాదం – సోషల్ మీడియాలో భారత వ్యతిరేక భావాలను సమర్థించిన బ్రిటిష్ లేబర్ ఎంపీ ప్రీత్ కె గిల్‌ను కలుసుకున్నాడు. రాఘవ్ చద్దా తన భార్య, నటి పరిణీతి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. భార్య పరిణీతి తిరిగి వచ్చింది, కానీ రాఘవ్ చికిత్స కారణంగా అక్కడే ఉండిపోయాడు.