కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కోసం ఎంతోమంది తపిస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే సమ్మర్ సీజన్ కావడం, పిల్లలకు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కోసం ఎంతోమంది తపిస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే సమ్మర్ సీజన్ కావడం, పిల్లలకు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లతో నిండిపోయింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక ప్రకటనలో వెల్లడించింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 10 కంపార్ట్ మెంట్లలో టైమ్ స్లాట్ ఎస్ ఎస్ డీ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 5 గంటల నిరీక్షణకు గురవుతున్నారు. ఆదివారం శ్రీవారిని 72,986 మంది భక్తులు దర్శించుకోగా, 33,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.79 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక తెప్పోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి స్వామి పుష్కరిణి జలాల్లో భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ సందర్భంగా రామచరుద్రుడు, రఘువీరుడు, తదితర కీర్తనలు ఆలపించగా, కొండపై వేదపండితులు, వేద మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. అయితే తిరుమల కొండలో ప్రతినిత్యం పూజ కార్యక్రమాలు కొనసాగుతుండటంతో భక్తుల నిత్యం తరలివస్తుంటారు. అయితే వేసవి సెలవులు సమీపిస్తుండటంతో ఈ రద్దీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.