మావోయిస్టు పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతారనే అనుమానాలతో దేశవ్యాప్తంగా పోలీస్ బలగాలు అలర్ట్ అయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రాణహిత నది దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించడంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
మావోయిస్టు పార్టీ మరో ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతారనే అనుమానాలతో దేశవ్యాప్తంగా పోలీస్ బలగాలు అలర్ట్ అయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రాణహిత నది దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించడంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టులు-దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ఆప్స్ యతీష్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో అహేరి సబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుండి C60, CRPF QAT బహుళ బృందాలు వేగంగా రంగంలోకి ఆ ఆపరేషన్ ను నిర్వహించారు.
SPS రేపన్పల్లికి ఆగ్నేయంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలమార్క పర్వతాలలో తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భద్రతా బృందాలు నక్సలైట్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. గతంలో జరిగిన ఎన్ కౌంటర్ కు గట్టి సమాధానమిస్తూ C60 బృందాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఫలితంగా నలుగురు మగ నక్సల్స్‌ను హతమయ్యారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఒక ఎకె 47, ఒక కార్బైన్, రెండు దేశీయ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి.
మృతుల్లో నక్సల్ అగ్రనేతలు మంగి ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి డీవీసీఎం వర్గీష్, సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి డీవీసీఎం మగ్తు ఉన్నారు. గతంలో వీరిపై పట్టిస్తే 36 లక్షల రివార్డును అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దాడి తర్వాత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పొరుగు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.