నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. అరుణ్ జైట్లీ మొదటి టర్మ్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ రెండోసారి ఆర్థిక మంత్రి. ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్‌కు పేరుంది. అంతే కాదు ఫిబ్రవరి 1ని కూడా కలుపుకుంటే నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభం కానుండగా , దానికి ఒకరోజు ముందుగా జనవరి 30న అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతి బడ్జెట్ సమావేశాలకు ముందు ఇలా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ ఎజెండా, విపక్షాల అభిప్రాయాలు వెల్లడి కావచ్చని అంతా భావిస్తున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రచురణకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, బడ్జెట్ సెషన్ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. కానీ, జనవరి 31న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 31న ఉమ్మడి సభలో ప్రసంగిస్తారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సెషన్లో బడ్జెట్‌పై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను వినియోగించుకునే అవకాశం బడ్జెట్ ద్వారా కల్పించారు. దీంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై పెద్దగా అంచనాలు లేవు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. అరుణ్ జైట్లీ మొదటి టర్మ్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ రెండోసారి ఆర్థిక మంత్రి. ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్‌కు పేరుంది. అంతే కాదు ఫిబ్రవరి 1ని కూడా కలుపుకుంటే నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అలాగే, నిర్మలా సీతారామన్ హయాంలో కొన్ని సంప్రదాయ ఆచారాలకు స్వస్తి పలికారు. బ్రిటీష్ వారి కాలం నుండి బడ్జెట్ సమర్పణ కోసం కాగితాలను బ్రీఫ్‌కేస్‌లో తీసుకువచ్చారు. ఇది 2019లో నిలిపివేశారు. 2021లో బడ్జెట్ పూర్తిగా డిజిటల్‌గా మారింది. నిర్మలా సీతారామన్ ట్యాబ్ చూస్తూ బడ్జెట్ ను చదువుతారు.