రోజులో ఒక ఉదయస్తమాన సేవ, ప్రాత:కాల సేవ లు ఐదు.. ఇలా రెండు సేవలకు కలిపి మొత్తం ఆరు టికెట్లు దేవస్థానం జారీ చేయనుంది. ప్రాత:కాల సేవలో పాల్గొనే సేవా కర్తలు ఒకరు లేదా దంపతులు స్వామి వారికి మహా మంగళహారతి, ప్రత్యేక పంచామృతాభిషేకం స్వామి వారి గర్భాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకునే వీలుని కల్పించనున్నారు. అంతేకాదు వేదపండితులు ఆ దంపతులకు వేద ఆశీర్వచనం అందించనున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రం.. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కొత్త సంవత్సరం జనవరి 3 తేదీ నుండి నూతనంగా ప్రాత:కాల సేవలు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉదయాస్తమాన సేవ 1,01,116 ఆర్జిత సేవ యధావిధిగా కొనసాగుతుంది. అయితే మల్లన్నకుప్రాత:కాలలో చేసే సేవలను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సేవకు 25,116 రుసుముని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం. అయితే రోజులో ఒక ఉదయస్తమాన సేవ, ప్రాత:కాల సేవ లు ఐదు.. ఇలా రెండు సేవలకు కలిపి మొత్తం ఆరు టికెట్లు దేవస్థానం జారీ చేయనుంది. ప్రాత:కాల సేవలో పాల్గొనే సేవా కర్తలు ఒకరు లేదా దంపతులు స్వామి వారికి మహా మంగళహారతి, ప్రత్యేక పంచామృతాభిషేకం స్వామి వారి గర్భాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకునే వీలుని కల్పించనున్నారు.
అంతేకాదు వేదపండితులు ఆ దంపతులకు వేద ఆశీర్వచనం అందించనున్నారు. ఈ ప్రాత:కాల సేవ టికెట్ తీసుకున్న భక్తులకు స్వామి వారి శేష వస్త్రం కాటన్ పంచ చీర జాకెట్ పీస్ ను మల్లన్న ప్రసాదంగా అందించనున్నారు. ఒకరోజు శ్రీశైల క్షేత్రంలో నివసించే వసతి కల్పించనున్నారు. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్వామి వారి స్పర్శ దర్శనం కల్పించనున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.