నేటి యుగం మొత్తం ఆన్‌లైన్‌పై ఆధారపడి పనిచేస్తోంది. దీనిని ఎరగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇందులో ముఖ్యంగా ఈ కామర్స్ షాపింగ్, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో అధిక సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ చేసే వారిని టార్గెట్ గా చేస్తున్నారు. అందులోనూ నగరాలు, పట్టణాలు, మెట్రో సిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
నేటి యుగం మొత్తం ఆన్‌లైన్‌పై ఆధారపడి పనిచేస్తోంది. దీనిని ఎరగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇందులో ముఖ్యంగా ఈ కామర్స్ షాపింగ్, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో అధిక సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ చేసే వారిని టార్గెట్ గా చేస్తున్నారు. అందులోనూ నగరాలు, పట్టణాలు, మెట్రో సిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ తన సర్వేలో తేటతెల్లం చేసింది. ఈ ఏడాది నవంబరులో దేశంలోని 180 నగరాలు, పట్టణాల్లో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో ఇప్పటి వరకూ జరిగిన సైబర్ నేరాల్లో ఈ కామార్స్ పేరిట జరిగేవి 35 శాతం కాగా, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని జరిగిన ఆన్లైన్ మోసాలు 28 శాతంగా వెల్లడించారు. బాధితులను ఫోన్ మెసేజ్, మెయిల్, కాల్స్ రూపంలో నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కాల్స్, మెయిల్స్, ఎస్ఎంఎస్ లు రోజుకు ఒకసారైనా వస్తుంటాయని 54శాతం మంది చెప్పారు. తమకు ఇలాంటివి నిత్యం వస్తూ ఉంటాయని 30 శాతం మంది తెలిపారు. దీని బారినపడి 20శాతం మంది మోసపోయినట్లు తెలిపారు. ఇలాంటి నేరాల బారినపడి తమ స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, పరిచయస్తులు మోసపోయినట్లు 47శాతం మంది తెలిపారు. ఇందులో అధిక శాతం పురుషులే ఉన్నట్లు వెల్లడైంది. ప్రతి వంద మందిలో 35 మంది మగవాళ్లు ఉండగా, 24 మంది మహిళలు ఉన్నట్లు సర్వేలో తెలిసింది.
ఇలాంటి సైబర్ నేరాల బారినపడిన వారిలో అధికశాతం మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని స్పష్టమైంది. దేశ వ్యాప్తంగా దాదాపు 59శాతం మంది సైబర్ నేరగాళ్ల బారినపడినప్పటికీ ఎలాంటి కంప్లైంట్లు చేయకపోవడం గమనార్హం. అయితే పోలీసులకు కంప్లైంట్ చేసిన వాళ్లలో 48 శాతం మంది తాము కోల్పోయిన డబ్బులను తిరిగి పొందినట్లు నిరూపితమైంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు 69 శాతం మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించడం లేదు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్ వేర్లను డౌన్లోడ్ చేసుకోవడం లేదని నిరూపితమైంది. దేశ వ్యాప్తంగా 47 శాతం మంది తెలియని వస్తువులు, ఆన్లైన్ షాపింగ్, ముందస్తు పేమెంట్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సైబర్ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాకొందరు నేరగాళ్లు మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించక తప్పదు.