ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది విద్యార్థుల చదువులకు అందించే సాయం. అందులో భాగంగా మన్నటి వరకూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిధులను సీఎం డీటీపీ కింద లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ లా నేస్తం నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 స్టైఫండ్ చొప్పున అందనుంది. దీని కోసం మొత్తం 7కోట్ల 98లక్షల 95వేలనులను ఖర్చు చేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన జూనియర్ లాయర్లకు మూడేళ్లపాటూ వృత్తిలో నిలదొక్కుకునేలా ఏడాదికి రూ. 60వేలు ప్రభుత్వ సాయంగా అందిస్తోంది. అలాగే న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్”ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారాన్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడికల్ క్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇలా ఇప్పటి వరకూ రూ. 25 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రస్తుతం అందించే లా నేస్తం నగదును ప్రతి ఏడాది రెండు విడతల్లో మొత్తం మూడేళ్లకు గానూ ఒక్కొ విద్యార్థికి రూ. 1.80లక్షలు ఖాతాలో జమ చేయనుంది. ఇప్పుడు జులై నుంచి డిసెంబర్ వరకూ విద్యా సంవత్సరానికి గానూ ఒక్కొక్కరికి 30,000 విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 6,069 మంది యువ లాయర్లకు నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం 49.51 కోట్లుగా తెలుస్తోంది.