Chandrababu: జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆక్టివేట్ అయ్యారు. గుంటూరు, బాపట్ల జిల్లాలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించారు.
చంద్రబాబు పర్యటనతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుడుతుున్నారు. వివిధ జిల్లాల్లో ఆయన వరుసగా పర్యటించనున్నారు.
ఇటు యువగళం పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. వైజాగ్ నుంచి ఇరువురు నేతలు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. జనవరి మొదటి వారం నుంచి ఇరువురు కలిసి సభలలో పాల్గొనున్నారు. స్థానికంగా ఓట్ల పరిశీలన, తొలగింపు, బోగస్ ఓట్ల చేరిక పై దృష్టి పెట్టాలని ఇరు పార్టీ నేతలను ఆదేశించారు. జనవరిలో పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల్లో పర్యటించాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు.