అక్రమ సంబంధం కేసులో ట్విస్ట్.
చింతూరు డిసెంబర్ 9 (ఆంధ్రపత్రిక):డిసెంబర్ రెండో తేది జరిగిన జంట హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు అక్రమ సంబంధం తో పాటు ఆర్థిక లావాదేవీల క్రమంలో పథకం ప్రకారం హత్య చేసినట్టు
మృతుడు శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు. ఆ క్రమంలో హత్య చేసి నిందితులు నాగేంద్ర, మినప శ్రీను తప్పించుకునేందుకు చట్టి గ్రామంలో ఉన్నటు సమాచారం మేరకు ఈ రోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు చింతూరు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ తెలిపారు. సమావేశంలో చింతూరు ఎస్సై శ్రీనివాసరావు తో పాటు మోతుగూడెం ఎస్ఐ గోపాలరావు పాల్గొన్నారు.