ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్‌తో సహా భారత్‌కు చెందిన మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా, 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్‌కు వరుసగా 5సార్లు చోటు దక్కించుకోవడం విశేషం. గతేడాది 36వ స్థానంలో నిలిచిన నిర్మలా, ఇప్పుడు 32వ స్థానంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్‌తో సహా భారత్‌కు చెందిన మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కింది. వీరిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా, 60వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా 76వ స్థానంలో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
నిర్మలా సీతారామన్ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్ అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా.. జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు.
తొలి స్థానంలో ఎవరంటే..
ఇక ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, 5వ స్థానంలో అమెరికా గాయని టేలర్ స్విప్ట్ నిలిచారు.