భారీ వర్షాల కారణంగా చెన్నై అంధకారంగా మారింది. భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందారు. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెం.మీ వర్షపాతం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా…
మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడుపై తుఫాన్ ప్రభావం ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల కారణంగా చెన్నై అంధకారంగా మారింది. భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందారు. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెం.మీ వర్షపాతం కురిసింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సబ్వేలు మూసివేశారు. నిత్యవసర సరకుల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. సహాయక చర్యలు కోసం సైన్యం రంగంలోకి దిగింది.
చెన్నైపై తుఫాన్ ప్రభావం..
మిచౌంగ్ తుఫాన్ దెబ్బకు చెన్నై అతలాకుతలమైంది. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇక చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది.
అధికారుల సహాయక చర్యలు..
చెన్నైలో పలు సబ్వేలను మూసేశారు. నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. NDRF, SDRF బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి..ఇప్పటివరకూ 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇక భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.