రాజస్తాన్ విషయానికొస్తే ఇక్కడ గడిచిన 30 ఏళ్లుగా అట్టు తిరగేసినట్లు ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అంటే ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూడొచ్చు. ఐదేళ్లకంటే ఎక్కువ కాలం ఏ పార్టీ అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు.
రాజస్తాన్ విషయానికొస్తే ఇక్కడ గడిచిన 30 ఏళ్లుగా అట్టు తిరగేసినట్లు ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అంటే ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూడొచ్చు. ఐదేళ్లకంటే ఎక్కువ కాలం ఏ పార్టీ అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో తాము ప్రవేశపెట్టిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ముప్పైఏళ్ల ఆనవాయితీకి గండికొట్టి మరోసారి కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.
కానీ వీటన్నింటికీ తెరదించుతూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టినట్లు తెలుస్తోంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండు మినహా కాంగ్రెస్ ఎక్కడా ఆధిక్యంలో కనిపించడం లేదు. ఇప్పటికీ బీజేపీ 111 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు కూడా తమ ప్రాభవాన్ని చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని రౌండ్లు పూర్తైనట్లు కనిపిస్తోంది. మిగిలిన రౌండ్లలో కాంగ్రెస్ ఆధిపత్యం చేపించినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీకి విజయం దాదాఫు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఆధిక్యంలో నుంచి బీజేపీ కొంత తగ్గినా మ్యాజిక్ ఫిగర్ 101 ఎప్పుడో దాటేసింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో తమ గెలుపుపై ఎలాంటి భయంలేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా స్పందిస్తూ మోదీ హవా రాజస్తాన్‌లో కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అంతటి క్లిష్ఠమైన పరిస్థితులే తలెత్తితే ఇతరుల నుంచి గెలిచిన ఇండిపెండెంట్లను తమ పార్టీలోకి ఆహ్వానించి ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోగలిగింది. దీని ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుందని చెప్పక తప్పదు.