ఉత్తర భారతం మరోసారి కాషాయం రంగు పులుముకోబోతుంది. మూడు రాష్ట్రాల్లో తన కమలం జెండాను ఎగురవేసేందుకు సిద్దమైంది బీజేపీ. ఇప్పటి వరకూ పోలైన ఓట్లు, ఆధిక్యంలో ఉన్న సీట్ల ప్రకారం బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రాలో తనదైన ముద్ర వేస్తూ గెలుపు దిశగా దూసుకుపోతోంది. మన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
ఉత్తర భారతం మరోసారి కాషాయం రంగు పులుముకోబోతుంది. మూడు రాష్ట్రాల్లో తన కమలం జెండాను ఎగురవేసేందుకు సిద్దమైంది బీజేపీ. ఇప్పటి వరకూ పోలైన ఓట్లు, ఆధిక్యంలో ఉన్న సీట్ల ప్రకారం బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రాలో తనదైన ముద్ర వేస్తూ గెలుపు దిశగా దూసుకుపోతోంది. మన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి కచ్చితమైన ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య కొనసాగుతున్న ఆధిక్యంలోని తేడాలను ఇప్పుడ గమనిద్దాం.
మధ్యప్రదేశ్..
గతంలో బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ మరోసారి స్పష్టమైన మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వచ్చే విధంగా ఆధిక్యం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 116 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సగమం అవుతుంది. కానీ బీజేపీ 158 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. కాంగ్రెస్ 70, ఇతరులు 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి బీజేపీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ109 కే పరిమితం అయింది. స్వల్ప సీట్ల తేడాతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి క్లియర్‌గా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జోరు ఇలాగే కొనసాగుతుందా.. లేక ఆధిక్యం తగ్గే అవకాశం ఉందా అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.
ఛత్తీస్‌గఢ్..
గతంలో కాంగ్రెస్ ఇక్కడ స్పష్టమైన మెజార్టీతో అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 శాశన సభ స్థానాలకు గానూ బీజేపీ 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 29, ఇతరులు 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. సాధారణంగా 46 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనిని బట్టి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 71, బీజేపీ 14, సీట్లను గెలుచుకున్నాయి. ఇతరులు కూడా కొన్ని చోట్ల గెలుపొందారు. అయితే నిన్న మొన్నటి వరకూ విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ ఆఅంచనాలు ఇప్పుడు తారుమారు అయ్యాయి. బీజేపీ కమలం పరిమళాన్ని వెదజల్లుతూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అయితే స్పష్టమైన ఫలితం వెలువడాలంటే మరి కొంత సమయం పడుతుంది.
రాజస్తాన్..
గతంలో కాంగ్రెస్ ఇక్కడ కచ్చితమైన సీట్ల మెజార్టీతో అధికారంలో ఉండేది. రాజస్తాన్‌లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ ఇప్పటి వరకూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 75, ఇతరులు 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సాధారణంగా అధికారం చేపట్టాలంటే 101 శాశనసభ స్థానాలను గెలవాల్సి ఉంటుంది. కానీ బీజేపీ అవసరమైన స్థానాల కంటే కూడా 8 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. సాయంత్రం వరకూ ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ కంటే తగ్గితే ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందికరపరిస్థితులు తలెత్తకుంటే సొంతంగా గెలుపొందిన స్థానాలతోనేబీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 107, బీజేపీ 70 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు కూడా తీవ్ర ప్రభావం చూపారు. అయితే ఈసారి బీజేపీవైపు రాజస్తాన్ ఓటర్లు మొగ్గు చూపినట్లు ప్రస్తుతం ఉన్న ఆధిక్యం బట్టి అర్థమవుతోంది.