చింతూరు డిసెంబర్ 02(ఆంధ్రపత్రిక):
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గజేంద్ర కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో చింతూరు ఎస్. ఐ గా పని చేశారు. ఆ తదుపరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంతకాలం చింతూరు సర్కిల్లో పనిచేశారు. హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని కారణంతో సస్పెన్షన్ గురి అయ్యారు,సస్పెన్షన్ కాలం పుర్తియిన పిదప తిరిగి చింతూరు రెవిన్యూ డివిజన్ ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వర్తించారు ఆ క్రమంలో తిరిగి చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీపై వచ్చారు శనివారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు