చింతూరు డిసెంబరు 01(ఆంధ్రపత్రిక):
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మామిళ్ళ గూడెం గ్రామంలో 2019 సంవత్సరం లో హత్యకు గురైన శ్యామల స్వప్న (15) మైనర్ బాలిక తల్లి శ్యామల రాధ చింతూరు కేంద్రం లో విలేకర్ల సమావేశం లో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గతంలో పని చేసిన చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పని చేసిన గజేంద్ర కుమార్ కు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా ముద్దాయి లకు సహకరించారని ముద్దయలు బెయిల్ వచ్చి బెదిరింపు చేశారని.సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకారంతో చేశారని వివిధ పార్టీలు,ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వించగ సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర పాటు నాటి ఎస్ఐ ను సస్పెండ్ చేశారని.తిరిగి చింతూరు డివిజన్ లో ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ రావడం తో బిక్కు బిక్కుగా బతుకుతున్నాం అని ఆ నేపథ్యం లో తిరిగి చింతూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రావడంతో నా కుమార్తె కేసు కోర్టు నడుస్తుండగా ఆ కేసు పై సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ ప్రభావం ఉంటుందని కావున సిఐను చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమాకాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అల్లూరి సీతారామ జిల్లా ఎస్పీ తుహిన్ సిహ్న కు వాట్స్ అప్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు. ఎన్ సి ఎస్ టి, హెచ్ ఆర్ సి లకు కూడా ఫిర్యాదు చేసినట్టు విలేకరుల సమావేశం తెలియజేశారు .