తెలంగాణలో పోలింగ్ ముగిసింది.. 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపే.. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.. కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిది..? ఓటింగ్ అనుకూలంగా మారుతుందా..? వ్యతిరేకత ప్రభావం ఎంత..? ఎక్కడ ప్లస్.. ఎక్కడ మైనస్.. ఇలా అన్ని చోట్ల జరిగిన ఓటింగ్ సరళిపై అంచనాలు వేస్తూ తలామునకలవుతున్నారు.. ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఆరా తీస్తున్నారు.
తెలంగాణలో పోలింగ్ ముగిసింది.. 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపే.. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.. కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిది..? ఓటింగ్ అనుకూలంగా మారుతుందా..? వ్యతిరేకత ప్రభావం ఎంత..? ఎక్కడ ప్లస్.. ఎక్కడ మైనస్.. ఇలా అన్ని చోట్ల జరిగిన ఓటింగ్ సరళిపై అంచనాలు వేస్తూ తలామునకలవుతున్నారు.. ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పల్స్ ఎంత ప్రభావితం చేస్తాయి.. ఏ అంచనాలు నిజమవుతాయంటూ బేరిజు వేస్తున్నారు.. అంతేకాకుండా.. గెలుపు, తమదంటే తమదంటు ప్రధాన పార్టీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఎవరి ధీమా వారు వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ కేసీఆరే సీఎం,బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందని మంత్రి కేటీఆర్ అంటే, తొమ్మిదో తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందంటూ రేవంత్‌రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఇక, బీజేపీ కూడా తాము కీరోల్ పోషించబోతున్నట్టు చెబుతోంది.
ఎవరి లెక్కలు వారివి.. ఎవరి అంచనాలు వారివి.. ఇలా ఇంతకాలం పేలిన మాటల తూటాలు.. ఇప్పుడు సైలెంట్ అయి నిశితంగా గమనిస్తున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న తరుణంలో అటు అంచనాలు, ఇటు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ నడుమ.. తెలంగాణలో కౌన్ బనేగా సీఎం అంటూ జోరుగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. అందరి చూపు గెలుపు ఎవరన్నది.. అనే దానిపైనే ఉంది.. ఈ క్రమంలో మళ్లీ క్యాంప్ రాజకీయాలు తెరపైకి వస్తాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. ఎవరికి వారు మళ్లీ క్యాంప్ రాజకీయాలు చేసే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే.. విమానాలు, హోటళ్లు బుక్ అయ్యాయని.. అభ్యర్థులకు అలర్ట్ కూడా వెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలకు క్యాంప్ రాజకీయాలు కొత్తేం కాదు.. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో కొన్నేళ్లుగా సర్వ సాధారణగా మారాయి. మొన్నటికి మొన్న బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించారు. ఈ క్యాంపు రాజకీయం సీఎం అభ్యర్థిని ప్రకటించేంత వరకు ఇదే ఉత్కంఠ కొనసాగింది. గతంలోనూ వైస్రాయ్ హోటల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో క్యాంప్ పాలిటిక్స్‌కి వేదికయ్యింది. ఎగ్జిట్ పోల్స్ సరళిని చూసిన తర్వాత ఇలాంటి తరహా రాజకీయమే తెలంగాణలో జరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే.. తెలంగాణ రాజకీయం బెంగళూరుకు మారుతుందా..? లేక ఎటువైపుకు షిష్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సో.. మొత్తంగా ఇప్పుడు 119 నియోజక వర్గాల నేతల భవితవ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆదివారం నాటికి ఎవరి జాతకం ఏంటన్నది తేలిపోనుంది..? మరి తెలంగాణ ఓటర్లు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన తీర్పిస్తారా.. లేదా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా హంగ్ వైపుకు దారి తీసే పరిస్థితులు కల్పిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కల్గిస్తున్న అంశం.