కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫిరెన్స్ చేపట్టారు. ఇందులో ప్రధాని లబ్ధిదారులతో మాటామంతి నిర్వహించారు. లబ్ధిదారుల పరస్పర చర్చ జరుగుతున్నప్పుడు సర్పంచ్ కుర్చీ కోసం పోటీ పడుతున్న సందర్బంగా ‘అప్ని కుర్సి సంహాలియే’ అని కుర్చీ కోసం పోటీ పడుతున్న మహిళ గురించి సరదాగా మాట్లాడారు.
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫిరెన్స్ చేపట్టారు. ఇందులో ప్రధాని లబ్ధిదారులతో మాటామంతి నిర్వహించారు. లబ్ధిదారుల పరస్పర చర్చ జరుగుతున్నప్పుడు సర్పంచ్ కుర్చీ కోసం పోటీ పడుతున్న సందర్బంగా ‘అప్ని కుర్సి సంహాలియే’ అని కుర్చీ కోసం పోటీ పడుతున్న మహిళ గురించి సరదాగా మాట్లాడారు. ఆమె గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, ఫార్మ్ మెషినరీ బ్యాంక్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే వివిధ రకాల ప్రభుత్వ పథకాల ద్వారా జమ్మూ జిల్లాలోని అర్నియాకు చెందిన మహిళా రైతు బల్వీర్ కౌర్ ట్రాక్టర్‌ను పొందినట్లు ప్రధానికి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ట్రాక్టర్ కొనుగోలు చేసినందుకు మోదీ ఆమెను అభినందించారు. ‘మీ దగ్గర ట్రాక్టర్ ఉంది, నా దగ్గర సైకిల్ కూడా లేదు’ అని సరదాగా మాట్లాడారు ప్రధాని మోదీ.
ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా తాను మాత్రమే లబ్ధి పొందడం కాదని, మీ పొరుగున ఉన్న పది గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయాలని సూచించారు. క్యూలో నిలబడిన చివరి వ్యక్తికి కూడా అన్ని ప్రయోజనాలు చేరుతాయన్న నమ్మకాన్ని కలిగించాలని సర్పంచ్‌కు వివరించారు. భారత సరిహద్దు ప్రాంత ప్రజలు అబద్దాలు చెప్పరని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే సరిహద్దు ప్రజలే కాదు, భారతీయులందరూ అబద్ధాలు చెప్పరు. సత్యం మన జాతి స్వభావంలో ఉంది అని దేశంలోని వ్యక్తుల గొప్పదనాన్ని వారితో పంచుకున్నారు.
ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రులు 59 మంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలకు, అట్టడుగు వర్గాల వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. లబ్ధి చేకూరని వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఉద్దేశం అని చెప్పారు. ఇప్పటి వరకూ లబ్ధి పొందిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారి అనుభవాలను విన్న మోదీ ప్రయోజనం పొందిన వారిని అభినందిస్తూ మరికొందరికి కూడా ఇలా ప్రయోజనం చేకూర్చేందుకు దోహదపడాలని సూచించారు.