వేపాడ,నవంబర్,28( ఆంధ్ర పత్రిక):
-ఈనెల 26న విశాఖలో జరిగిన 19వ డబ్ల్యూ.కె.ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో ఎస్.కోటలో గల మొహంతి కౌముది గ్లోబల్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న జి.తపస్యశర్మ ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించింది.అలాగే 5వ తరగతి చదువుతున్న వి.ప్రీతం శంకర్ కామాక్షి పథకం సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ శాంతి మెహంతి సోమవారం తెలిపారు.ఈ మేరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కోచ్ జగదీష్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితర పాఠశాల సిబ్బంది అభినందించారు.