తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ప్రచార పర్వంలో భారత రాష్ట్ర సమితి స్పీడును పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నాలుగు ఛాలెంజ్‌లు విసిరారు. పదేళ్లలో లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. జరగలేదని రాహుల్ నిరూపించగలరా? అంటూ సవాల్ చేశారు.
తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ప్రచార పర్వంలో భారత రాష్ట్ర సమితి స్పీడును పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నాలుగు ఛాలెంజ్‌లు విసిరారు. పదేళ్లలో లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. జరగలేదని రాహుల్ నిరూపించగలరా? అంటూ సవాల్ చేశారు. దేశం మొత్తంమీద తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాల భర్తీ జరిగింది.. ఏ రాష్ట్రం కూడా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కర్నాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేయలేదా? రాహుల్‌గాంధీ ఒక్క ఉద్యోగమైనా చేశారా? ఎప్పుడైనా పరీక్ష రాశారా?.. అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 14ఏళ్లుగా నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటున్నామని వివరించారు. తెలంగాణ జాతిని ఏకంచేసిన రోజు నవంబర్ 29.. ఆరోజే తెలంగాణ మహోద్యమానికి బీజం పడిందని కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29న తెలంగాణ ప్రజలంతా దీక్షాదివస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 29న బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని.. కేసీఆర్ దమ్మున్న నాయకుడు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది.. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కే ఉందన్నారు. పీఎం కీసాన్ డబ్బులు వేశారని.. రైతు బందు వేస్తే రేవంత్ ఎందుకు ఆగమవుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ అంటూ విమర్శించారు.