తెలంగాణలో పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడింది. దీంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచిన జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దింపాయి. అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ తరుణంలో కమలం పార్టీ ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది.
తెలంగాణలో పోలింగ్‌కి కౌంట్‌డౌన్ దగ్గరపడింది. దీంతో ప్రచారపర్వంలో స్పీడు పెంచిన జాతీయ పార్టీలు అగ్రనేతల్ని రంగంలోకి దింపాయి. అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. ఈ తరుణంలో కమలం పార్టీ ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది. బీసీ సీఎం నినాదంతో హేమాహేమీలను రంగంలోకి దించింది. ప్రధాని నరేంద్రమోదీ 3 రోజులపాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నిన్న కామారెడ్డి, తుక్కుగూడ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ఇవాళ దుబ్బాక, నిర్మల్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు.
ఇవాళ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్‌లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం నిర్మల్‌కు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్తారు. రాత్రి తిరుమలకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలుకుతారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించి..బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ ముగుస్తుంది. ఇలా మొత్తానికి సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఢిల్లీ నేతలతో తెలంగాణ గల్లీల్ని హోరెత్తిస్తోంది కమలం పార్టీ.