హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతోపాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం స్ధాయిలు పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియా బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి…
రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్ధితులు దుర్భరంగా మారుతున్నాయి. దీంతో శ్వాస సంబంధిత వ్యాధులు కేసులు హైదరాబాద్‌లోనూ అధికంగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాలుష్యం ఢిల్లీని దాటే అవకాశాలున్నాయా.? ఇప్పటికిప్పుడు తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఏలాంటి చర్యలు తీసుకోవాలి..? లాంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతోపాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం స్ధాయిలు పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియా బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాహనాల రద్దీ, కన్ స్ట్రక్షన్ పేరుతో గుట్టలను తవ్వడంతోపాటు రాళ్లు తొలగించడం, పొల్యూషన్ పెరగడానికి మరింత దోహదపడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఇటీవల పీసీబీ డేటా ప్రకారం, 31 స్టేషన్స్ లో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం 10 స్ధాయిలు నమోదయ్యాయి. కోకాపేట పీఎం స్టేషన్లో పీఎం 2.5 స్ధాయిలు 40 కంటే ఎక్కువగా ఉన్నాయి. జీవ ద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గృహ వాయు కాలుష్యం శ్వాస కోశ వ్యాధులకు ప్రధాన కారణమని , దీనిపై జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా చలికాలంలో నవంబర్, డిసెంబర్ , జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
చలికాలంలో గాలి పైకి పోకుండా పీల్చే స్ధాయిలోనే కాలుష్యంగా మారుతుందని.. దీనికి పెరుగుతున్న వాహనాలు , భవన నిర్మాణం, చెత్త కాల్చడం వంటివి ప్రధాన కారణమంటున్నారు. పర్యావరణ నిపుణులు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో విపరీతంగా పెరిగిన పొల్యూషన్ అక్కడ నివాసించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అక్కడి పొల్యూషన్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నారు. అయితే భారత్ లో ఉన్న నగరాలతో పోలిస్తే సౌత్ ఇండియా హైదరాబాద్ 5వ స్ధానంలో ఉంది.
ఇక హైదరాబాద్‌లో పొల్యూషన్ మరింత పెరిగే అవకాశాలున్నట్లు… డిల్లీని దాటే పరిస్ధితులు కనబడుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికిప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంపల్లి, కోకాపేట, మోకిల్లా, కాజ గూడ వంటి ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 పెరిగిపోయాయని.. ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు.. పర్యావరణ నిపుణులు. నేషనల్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 250 కోట్లు ప్రతీ ఏటా వస్తున్నా.. పరిస్ధితుల్లో మార్పు కనిపించకపోగా.. పొల్యూషన్ రోజుకింత పెరుగుతోంది.