ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి మరింత హీటెక్కింది. మరో నెల రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారంతో పార్టీలు ఫోకస్ పెంచాయి. సీట్లు, అభ్యర్థులు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, బడా నేతలతో బిగ్ మీటింగ్స్ వంటి వాటితో ఎలక్షన్ మోడ్ ను హెరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన చేయగా.. కాంగ్రెస్, బీజెపీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి.ఇక మిగిలిన వామపక్షాలు సీపీఐ, సీపీఎం మాత్రం కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల వేళ హస్తం, ఎర్రదండు మధ్య పొత్తుపై తెగని పంచాయితీ నెలకొంది . అసెంబ్లీ ఎన్నికలకు వంద రోజులు కూడా లేదు. ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలు సీట్లు, అభ్యర్థుల మీద ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ ఏకంగా అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి చేసింది. ఇక బీఆర్ఎస్.. లెఫ్ట్ పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో వామపక్షాలకు హస్తమే దిక్కైంది. చర్చలు సాగుతున్నా.. సీట్ల సర్దుబాటు తేలడం లేదు. ఇంతకీ వామపక్షాలు అడుగుతున్న సీట్లేంటి..? కాంగ్రెస్ కు అక్కడ అడ్డంకులేంటి.. ? ఈ వివరాలన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి మరింత హీటెక్కింది. మరో నెల రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్న ప్రచారంతో పార్టీలు ఫోకస్ పెంచాయి. సీట్లు, అభ్యర్థులు, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, బడా నేతలతోబిగ్ మీటింగ్స్ వంటి వాటితో ఎలక్షన్ మోడ్ ను హెరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన చేయగా.. కాంగ్రెస్, బీజెపీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి.
ఇక మిగిలిన వామపక్షాలు సీపీఐ, సీపీఎం మాత్రం కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నాయి. మునుగోడు ఊపుతో అధికార బీఆర్ఎస్తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందనుకున్న ఎర్రసైన్యానికి కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. దీంతో బీజెపీతో కలవలేని లెఫ్ట్ పార్టీలకు ఇక హస్తమే ఆపన్న హస్తం ఇవ్వాలి. జాతీయ స్థాయిలో ఎలాగో ఇండియా కూటమిలో రెండు కలిసి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా కాంగ్రెస్‌తో జతకట్టేందుకు వామపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. ఖమ్మం జిల్లాపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన వామపక్షాలు సీపీఐ, సీపీఎం కలిసి మొత్తం పది సీట్లు కాంగ్రెస్‌ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. తమకు బలమున్న స్థానాల్లోనే సీట్లను అడుగుతున్నామని కామ్రేడ్లు అంటున్నారు. ఇందులో సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడం, వైరా, నల్గొండలోమునుగోడు, ఆదిలాబాద్ లో బెల్లంపల్లి, కరీంనగర్ లో హుస్నాబాద్ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు సీపీఎం భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ సీట్లు అడుగుతోంది. ఇందులో కాంగ్రెస్ ఏ ఒక్కసీటు కేటాయించలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకు ఆయా స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండటమే కారణం.
సీపీఐ అడుగుతున్న సీట్లలో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కానీ ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీటు కోరుకుంటున్నారు. ఎదో ఒక సీటు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సీపీఎం అడుగుతున్న మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పొడెం వీరయ్య సిట్టింగ్స్థానాల్లో ఉన్నారు. వారిని కాదని లెఫ్ట్‌కి ఆ సీట్లు ఇచ్చే పిరిస్థితి లేదని చెబుతున్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ కి తుమ్మల వస్తే ఆయన, ఇప్పటికే పొంగులేటి కూడా ఆ స్థానాన్ని కోరుతుండగా.. షర్మిల సైతం కాంగ్రెస్ లో విలీనం అయితే పాలేరు అడుగుతున్నట్లు సమాచారం. దీంతో పాలేరు అప్ కమింగ్ జాయినింగ్స్ తో జామ్ అయింది. పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనుకుంటున్నారు. అందుకే గట్టిగా పట్టుబడుతున్నారు.
దాదాపు పది సీట్లను ఆశిస్తున్న లెఫ్ట్ పార్టీలకు 2 నుంచి 3 సీట్లు మాత్రమే కేటాయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. కావాలంటే ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ స్థానాల్లో సర్దుబాటు చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో సీపీఐ, నల్గొండలో సీపీఎంకు ఒకటి చొప్పున ఇచ్చి ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. కానీ కామ్రేడ్లు మాత్రం కనీసం జిల్లాకు రెండు చొప్పున ఇచ్చిన దోస్తీ కట్టే ఛాన్స్ కనపడుతోంది. రెండు మూడు సార్లు చర్చల జరగగా.. మరో మారు జరిగే చర్చల్లో కాంగ్రెస్, కామ్రేడ్ల దోస్తీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.