ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్ట్ ల ఏర్పాటుపై శ్రద్ధ చూపాలనిన్నారు. ప్రతీ ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకునేలా Free and Fair Elections కోసం భద్రత కల్పించాలన్నారు.
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల బందోబస్త్ కు సంబంధించి పోలీస్ అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అన్నారు. సీపీ ట్రాఫిక్ జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ్ నాయక్, ఐపీఎస్., డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపిఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు ఇతర పోలీస్ అధికారులతో కలిసి సైబరాబాద్ సీపీ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్ట్ ల ఏర్పాటుపై శ్రద్ధ చూపాలనిన్నారు. ప్రతీ ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కునువినియోగించుకునేలా Free and Fair Elections కోసం భద్రత కల్పించాలన్నారు.
ఎన్నికలకు సంబంధించి బందోబస్త్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సిబ్బంది డిప్లాయ్ మెంట్, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై స్పష్టత కలిగి ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. గత ఎన్నికల్లో అమలు చేసిన గుడ్ ప్రాక్టీసెస్ (ఉత్తమ చర్యలు) ను అమలు చేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ముందే ఈ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ స్థాయి లో ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని సూచించారు.
అలాగే ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర, భద్రతా దళాల డిప్లాయ్ మెంట్, నామినేషన్ దాఖలు నుండి ప్రచార పర్వం, పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్బీ డిసిపి అశోక్ కుమార్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు….సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా శాంతి భద్రతలను పర్యవేక్షించాలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు, ప్రత్యేక బందోబస్తు తదితర అంశాల గురించి వివరించారు…అసాంఘిక శక్తులు, గొడవలు సృష్టించే వారిని కొందరిని ఇప్పటికీ గుర్తించి బైండోవర్ చేశామన్నారు. NBWs, మిగిలిన వారిని కూడా గుర్తించి బైండోవర్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.