Thummala Nageswara Rao: తనను అవమానించిన రీతిలోనే మాజీ మంత్రి తుమ్మలను ఇప్పుడు అవమానిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి మిమ్మల్ని మేము తొలగించాం, కాని మీరే వెళ్లేలా చేస్తామనే పరిస్థితిని BRS నాయకత్వం చేస్తోందని అన్నారు. అపాయింట్మెంట్ కూడా దొరకలేదని, ఈ విషయాలు చెప్పుకుంటే పరువు పోతుందని తెలిపారు. కాంగ్రెస్లో చేరాలని తుమ్మలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తుమ్మలతో కలిసి ఆయన మీడియాతో..
ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజుకింత ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. ఇక హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలోనికి తుమ్మల నివాసానికి వచ్చిన పొంగులేటి – కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్లో తుమ్మలతో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని తుమ్మలను రేవంత్ ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ తనను అవమానించిన రీతిలోనే మాజీ మంత్రి తుమ్మలను ఇప్పుడు అవమానిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి మిమ్మల్ని మేము తొలగించాం, కాని మీరే వెళ్లేలా చేస్తామనే పరిస్థితిని BRS నాయకత్వం చేస్తోందని అన్నారు. అపాయింట్మెంట్ కూడా దొరకలేదని, ఈ విషయాలు చెప్పుకుంటే పరువు పోతుందని తెలిపారు. కాంగ్రెస్లో చేరాలని తుమ్మలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తుమ్మలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మల రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయని అన్నారు. అయితే పార్టీలో చేరడమన్నది తుమ్మల ఒంటరిగా తీసుకునే నిర్ణయం కాదని, ప్రజల కోరిక మేరకు ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన ఉంటుందని పొంగులేటని అన్నారు.
కాంగ్రెస్లో చేరాలని తనను ఆహ్వానించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. తన స్వార్థం, తన కుటుంబం కోసం తాను ఏనాడు పనిచేయలేదని స్పష్టం చేశారు. మంత్రిగా తాను ఖమ్మం జిల్లాను మిగిలిన అన్ని జిల్లాల కంటే మిన్నగా అభివృద్ధి చేశానని అన్నారు. కాంగ్రెస్లో చేరిక గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్లుప్తంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు గురించి కాని, తన మనస్సులో ఏముందోననే విషయం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అయితే తన రాజకీయ లక్ష్యం సీతారామ ప్రాజెక్టని తెలిపారు.