సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అతను ఓ సర్కారీ స్కూల్‌ను దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేశాడు
సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న అతను ఓ సర్కారీ స్కూల్‌ను దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేశాడు. సుమారు కోటి ఖర్చు రూపాయలు ఖర్చుచేసి గచ్చిబౌలి కేశవనగర్‌లో ప్రాథమిక పాఠశాలను ఏకంగా కార్పొరేట్ స్కూల్ తరహాలో రీఇన్నోవేషన్ చేయించాడు. హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (జులై 12)న సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్నారు. స్కూల్‌కు సంబంధించిన ఫొటోలు, ఇతర వివరాలను ట్విట్టర్లో షేర్ చేశాడు కల్వకుంట్ల హిమాన్షు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సర్కారీ స్కూల్‌కు సాయం చేసిన కేసీఆర్ మనవడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హిమాన్షు రావ్ ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదువుతుండగా.. అక్కడికి సమీపంలోని గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు.. పలు మార్లు అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాడు. పాఠశాలలో ఎక్కువమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని తెలుసుకున్నాడు. స్కూల్లో సౌకర్యాలు మెరుగుపరచి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం స్కూల్‌ను దత్తత తీసుకున్నాడు. క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ (CAS) అధ్యక్షుడిగా సుమారు రూ. కోటి ఖర్చుచేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. విద్యార్థులకు బెంచీలు, టాయిలెట్ల నిర్మాణం, భోజనం గది, ఆట స్థలం తదితర సౌకర్యాలను సమకూర్చాడు. ఈ విషయాలన్నింటినీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్ వెల్లడించారు.