తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీయస్సీ ప్రకటన వెలువరించింది. తొలుత 1,363 పోస్టులతో డిసెంబరు 30న కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు బీసీ గురుకుల..
తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీయస్సీ ప్రకటన వెలువరించింది. తొలుత 1,363 పోస్టులతో డిసెంబరు 30న కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1,375కి పెరిగాయి. తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మరోసారి అదనంగా 13 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది.
ఇక గ్రూప్ 3 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు గ్రూప్ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష పత్రం ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.