యోగా ప్రాముఖ్యత యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు యోగాను అభ్యసిస్తున్నారు. జిమ్, వర్కౌట్స్ కంటే కూడా యోగాసనాలు ప్రభావవంతగా ఉండటంతో ప్రతి ఒక్కరు యోగాసనాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
యోగా ప్రాముఖ్యత యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు యోగాను అభ్యసిస్తున్నారు. జిమ్, వర్కౌట్స్ కంటే కూడా యోగాసనాలు ప్రభావవంతగా ఉండటంతో ప్రతి ఒక్కరు యోగాసనాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, యోగా చేయడం వలన శారరీకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. యోగా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. మనస్సును కూడా చురుకుగా చేస్తుంది. కొన్ని యోగాసనాలు రోజూ చేయడం వలన.. మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా 5 యోగాసనాలు రోజూ చేయాలని సూచిస్తున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పద్మాసనం..
ఈ యోగాసనం చేయడానికి ముందుగా నేలపై ప్రశాంతంగా కూర్చోవాలి. ఎడమ కాలును కుడి కాలుపై ఉంచి.. తుంటి వైపునకు లాగాలి. ఇప్పుడు రెండు చేతులను మోకాళ్లపై ఉంచి, కళ్లు మూసుకుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత మెల్లగా శ్వాసను వదలాలి. ఇలా గాలి పీలుస్తూ, వదులుతూ కాసేపు చేయాలి. ఇలా చేయడం వలన శరీరానికి కొత్త శక్తి అందుతుంది.
ధనురాసనం..
ఈ యోగాసనాన్ని చేయడానికి, ముందుగా మీరు బోర్లా పడుకోవాలి. ఆ తరువాత మీ కాళ్ళను పైకి లేపి, వాటిని తలవైపునకు తీసుకురావాలి. ఆ తరువాత, చేతులను వెనుకకు పెట్టి, వాటితో అరికాళ్లను పట్టుకోవాలి. తలను కాస్త పైకి లేపాలి. ఈ భంగిమలో మెల్లగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. పట్టుకోండి. ఈ భంగిమలో పాదాలు, చేతులను వీలైనంత వరకు పైకి లేపాలి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ ప్రశాంతంగా ఉంటాయి.
చక్రాసనం..
ఈ ఆసనం వేయడానికి ముందుగా మీరు వెల్లకిలో పడుకోవాలి. ఆ తరువాత మీ కాళ్ళు, చేతులను వెనకవైపు వంచుతూ.. నడుము భాగాన్ని పైకి లేపాలి. ధనుస్సు ఆకారంలో శరీరం ఉండేలా తీసుకురావాలి. తలను కిందకు వంచి నేలను చూసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది.
ప్రాణాయామం..
ప్రాణాయామం చేయడం వలన మనస్సు ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది. ఈ యోగాసనం వల్ల ఆలోచనా శక్తి పెరుగుతంది. అనులోమ, విలోమ, భ్రమరి, కపాల్భాతి వంటి ప్రాణాయామం ప్రయత్నించొచ్చు. పశ్చిమోత్తాసనం, బాలాసనం, శీర్షాసనం, వృక్షాసనం వంటి యోగాసనాల ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈ ఆసనాలు చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.