Fake Baba arrested in Warangal: సాటి వారి సమస్యలతో ఆ బాబా రెచ్చిపోతాడు.. కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ మాయమాటలు చెబుతాడు. సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతుంటాడు..
సాటి వారి సమస్యలతో ఆ బాబా రెచ్చిపోతాడు.. కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ మాయమాటలు చెబుతాడు. సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతుంటాడు.. అలాంటి దొంగ బాబాను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ బాబా నుంచి రూ.25 వేల నగదుతోపాటు.. తాయత్తులు, వన మూలికలు, దారాలు, నిమ్మకాయలు, నూనె డబ్బాలు, ఇలా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే.. దాదాపు 40 ఏళ్ల కిందట వరంగల్ నగరానికి వచ్చాడు.ఈ క్రమంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో నివాసం ఏర్పాటుచేసుకుని బాబా అవతారమెత్తాడు. తన మంత్ర శక్తులతో కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తానంటూ చుట్టుపక్కల వారందరినీ నమ్మించాడు. అలా చూస్తుండగానే ఫేమస్ అయ్యాడు. ఇలా పలువురు మహిళలు, యువతులను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే.. తన భర్తతో ఉన్న విభేదాలను పరిష్కరించాలంటూ కొద్దిరోజుల క్రితం ఓ మహిళ లబ్బేను సంప్రదించగా పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పింది. బాధితురాలితోపాటు ఆమె కుటుంబ సభ్యులు టాస్క్ఫోర్స్పోలీసులను ఆశ్రయించడంతో దొంగ బాబా బాగోతం మొత్తం బయటపడింది. అయితే, నిందితుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.