ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాయ్‌పూర్‌లోని సంస్థ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 169 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్స్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసుఎ 45 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 10-07-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.