వికారాబాద్‌లో నర్సింగ్ చేస్తోంది శిరీష. తల్లి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి ఊరికి వచ్చి శవమై తేలింది. ఏమైందో అని అంతా అనుమానించారు. ఎవరో తెలియని వ్యక్తులు పొట్టన పెట్టుకొని ఉంటారని కుటుంబ సభ్యులు, పోలీసులు అంతా అనుమానించారు. కట్ చేస్తే.. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
వికారాబాద్‌లో నర్సింగ్ చేస్తోంది శిరీష. తల్లి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి ఊరికి వచ్చి శవమై తేలింది. ఏమైందో అని అంతా అనుమానించారు. ఎవరో తెలియని వ్యక్తులు పొట్టన పెట్టుకొని ఉంటారని కుటుంబ సభ్యులు, పోలీసులు అంతా అనుమానించారు. కట్ చేస్తే.. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. బావ అనిల్ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు పోలీసులు. పరిగికి చెందిన శిరీష కేసులో మిస్టరీ వీడింది. ఆమెను బావ అనిల్ దారుణంగా హత్య చేశాడు. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. అక్క భర్త అనిల్, శిరీష మధ్య వివాహేతర సంబంధం ఉంది. అదే సమయంలో ఫోన్ ఎక్కువగా పట్టుకుంటున్నావు అంటూ అన్న శిరీషను తిట్టాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బావ కూడా శిరీషని కొట్టాడు. అది కాక కలుద్దాం అంటూ శిరీషని అర్థరాత్రి బయటకు పిలిచాడు అనిల్.ఆపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు రాబడుతున్నారు. పరిగి మండలం కాడ్లాపూర్లో హత్యకు గురైంది శిరీష. పోస్టు మార్టం అనంతరం మృతిదేహాన్ని మృతురాలి సోదరుడు శ్రీకాంత్‌కు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా మారనుంది పోస్ట్‌మార్టం రిపోర్ట్.
హత్యకు ముందు ఇంట్లో ఘర్షణ
శిరీష ఈ మధ్యే కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. హార్ట్ అటాక్‌కు గురైన తల్లి హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్లింది. తండ్రి, కూతుళ్లు ఇంటి దగ్గర ఉన్నారు. రాత్రి ఒంటిగంట తరువాత శిరీష ఇంట్లో లేని విషయాన్ని గుర్తించిన తండ్రి.. చుట్టుపక్కల వెతికాడు. ఎంత వెదికినా శిరీష ఆచూకీ లభించలేదు. చివరకు ఊరిచివర నీటి కుంటలో శవమై తేలింది. నిన్న మధ్యాహ్నం శిరీష మృతదేహాన్ని స్థానికులు నీటికుంటలో గుర్తించారు. శిరీష కళ్లపై స్ర్కూ డైవర్‌తో దాడిచేసినట్లు పోలీసులు గుర్తించారు. నరాలను బ్లేడుతో కోసి కిరాతకంగా హత్యచేశారన్నారు పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి. శిరీష హత్యకు కొద్ది గంటల ముందు ఇంట్లో జరిగిన ఘర్షణ అనేక అనుమానాలకు తావిస్తోంది.బావ కొట్టడంతో అలిగిన శిరీష ఇంట్లోనే సూసైడ్ అటెమ్ట్ చేసినట్లు సోదరుడు చెప్తున్నాడు.
ఇంతకీ శిరీష బావ ఆమెను ఎందుకు కొట్టాడు? ఈ కేసులో రేకెత్తుతున్న అనుమానాలకు సమాధానాలు వెదికే పనిలో పడ్డారు పోలీసులు. శిరీష అక్క భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో శిరీష తిరిగి కాలేజీకి వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.