వర్షం పడినా.. ఎలాంటి మార్పు లేదు.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతను తప్పించుకునేందుకు..
వర్షం పడినా.. ఎలాంటి మార్పు లేదు.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతను తప్పించుకునేందుకు జనాలు ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏసీ కొనాలంటే.. చాలా డబ్బుతో కూడుకున్న విషయం. అంతేకాదు.. ఒక్కసారి ఆన్ చేస్తే చాలు.. కరెంట్ బిల్లు గిర్రున తిరిగి.. మన తలబొప్పి కట్టేలా వస్తుంది. అందుకోసమే మార్కెట్లోకి పోర్టబుల్ ఏసీలు వచ్చేశాయి. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్లకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాల్లోనే మీ ఇంటిని చల్లబరుస్తాయి. కాంపాక్ట్, బరువులో తేలికైనందున, ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. పోర్టబుల్ ఏసీతో విద్యుత్ బిల్లు కూడా పెద్దగా రాదు. మరి రూ. 10 వేలలోపు మార్కెట్లో దొరికే పోర్టబుల్ ఏసీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
CEROBEAR రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీ:
ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇందులో 3 స్పీడ్ టెక్నాలజీ ఉంది. మీరు కోరుకున్న విధంగా ఇందులో అమర్చబడిన ఫ్యాన్ వేగాన్ని పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు. ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 11 వేలు. ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లో ఇది రూ. 10 వేలకే లభిస్తోంది.
LaoTzi రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీ:
LaoTzi రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీలో ఆనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కూడా 3 స్పీడ్ టెక్నాలజీ ఉంది. దీనిలో అమర్చిన నైట్ ఎల్ఈడీ లైట్లు 7 రంగులలో కాంతిని ప్రకాశిస్తాయి. యూఎస్బీ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. దీని ధర కూడా రూ. 10 వేలులోపే ఉంది.
షాలెక్ పోర్టబుల్ ఏసీ:
ఈ పోర్టబుల్ ఏసీని ఇంట్లో లేదా కార్యాలయంలో ఎక్కడైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. క్షణాల్లో ఇల్లంతా చల్లబరుస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 9 వేలు.