ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్- 2023 ఈ ఏడాది భారత్ వేదికగా ప్రారంభం కానుంది. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీమిండియా విషయానికొస్తే.. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. వీరు ఎప్పటికి ఫిట్నెస్ సాధిస్తారో అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్- 2023 ఈ ఏడాది భారత్ వేదికగా ప్రారంభం కానుంది. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీమిండియా విషయానికొస్తే.. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. వీరు ఎప్పటికి ఫిట్నెస్ సాధిస్తారో అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు ఒక వార్త ఊరట కలగించింది. అదేంటంటే గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వికెట్ కీపర్ అండ్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అయితే ఊహించిన దానికంటే వేగంగా పంత్ కోలుకుంటున్నాడని తెలుస్తోంది.అన్నీ కుదిరితే మరో రెండు మూడు నెలల్లో రిషబ్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీసీసీఐకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పంత్కు ఇప్పటికే పలు పలు సర్జరీలు జరిగాయి. అయితే అతడికి మరో మైనర్ సర్జరీ అవసరమని మొదట భావించారు. ఇందుకోసం అతడిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వైద్యులు చెకప్ చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం బాగా కోలుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఎలాంటి సర్జరీలు అవసరమలేదని వైద్యలు నిర్ణయించారు. ఇది టీమిండియాకు చాలా మంచి వార్త. పంత్ మనం మొదట ఊహించిన దాని కంటే ముందుగానే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది’ సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అంటే అన్నీ కుదిరితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్లో పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఇక గతేడాది డిసెంబర్ నుంచి పంత్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2023తో పాటు వరల్డ్టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూరమయ్యాడు.