దేశంలో నానాటికీ పిల్లల కిడ్నాప్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే..
దేశంలో నానాటికీ పిల్లల కిడ్నాప్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ర్టాల్లో కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నది. ఇందులో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. అంతర్జాతీయ పిల్లల దినోత్సం సందర్భంగా (మే 25న) గురువారం చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్ధ (క్రై) ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది.‘మిస్సింగ్ చైల్డ్హుడ్స్’ పేరిట విడుదలైన ఈ బుక్‌లెట్‌లో వివిధ రాష్ర్టాల్లో ప్రతిరోజు తప్పిపోతున్న పిల్లల కేసుల గణాంకాలను పేర్కొన్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డాటా ప్రకారం మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ప్రతిరోజూ 31 మంది పిల్లలు గల్లంతవుతున్నారు.
దేశంలో నానాటికీ కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో పిల్లల అపహరణ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అందునా అడపిల్లలు అధిక సంఖ్యలో మిస్సవుతున్నారు. మే 25న International Missing Children’s Day పురస్కరించుకుని ఎన్జీవో చైల్డ్ రైట్స్ అండ్ యూ (CRY) ‘మిస్సింగ్ చైల్డ్హుడ్స్’ పేరిట డేటా విడుదల చేసింది. దీని ప్రకారం 2021లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కంటే మధ్యప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో పిల్లలు కనిపించకుండా పోయారు. దాదాపు 11,607 పిల్లలు ఒక్క మధ్యప్రదేశ్‌లోనే మిస్సైనట్లు గణాంకాలు తెల్పుతున్నారు. వీళ్లలో 81 శాతం మంది ఆడపిల్లలే ఉన్నట్లు తెల్పింది. అంటే ప్రతి రోజూ ఆ రాష్ట్రంలో 31 మంది చొప్పున చిన్నారులు అదృశ్యమవుతున్నారు.
కనిపించకుండా పోతున్న పిల్లల సంఖ్య ఈ రాష్ట్రంలో ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. 2020లో 7,230 మంది బాలికలు తప్పిపోగా, మరుసటి ఏడాది 2021లో ఆ సంఖ్య 9,407కు చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే బాలికల మిస్సింగ్ కేసులు 30.11 శాతం పెరిగాయి. కిడ్నాపైన బాలికలను బలవంతపు వివాహాలు, గృహ సహాయకులు, సెక్స్ వర్కర్లుగా వినియోగిస్తున్నారు. 2021 సంవత్సరంలో మొత్తం 12,486 మంది తప్పిపోయిన పిల్లలను పోలీసులు రక్షించారు. వారిలో 10,204 మంది బాలికలు ఉన్నారు.
మరికొందరేమో చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోతున్నారు. చిన్న వయసులోనే మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోయే అమ్మాయిల్లో అధికంగా.. తక్కువ ఆదాయ, అట్టడుగు కుటుంబాల నుంచి వచ్చిన బాలికలే ఎక్కువగా ఉంటారు. ఇలా తప్పిపోయిన బాలికల జీవితంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. సామాజిక బహిష్కరణ, చదువులకు అంతరాయం, బలవంతపు వివాహం, దీర్ఘకాల మానసిక-సామాజిక ప్రభావాలు, ప్రతికూలత, ద్వేషం, నిస్సహాయత, అవమానం వంటి రూపాల్లో మరింత వేధింపులకు గురవుతున్నారు.
మధ్యప్రదేశ్‌లో ప్రతీయేట మిస్సైన పిల్లల గణాలు ఇవే..
2017లో మొత్తం 10,110 మంది పిల్లలు తప్పిపోయారు (బాలికలు – 7409, బాలురు – 2701)
2018 లో మొత్తం 10, 038 మంది పిల్లలు తప్పిపోయారు (బాలికలు – 7564, బాలురు – 2464)
2019 లో మొత్తం 11022 మంది పిల్లలు తప్పిపోయారు (బాలికలు – 8572, బాలురు – 2450)
2020 లో మొత్తం 8751 మంది పిల్లలు తప్పిపోయారు (బాలికలు – 7230, బాలురు – 1521)
2021 లో మొత్తం 11,607 మంది పిల్లలు తప్పిపోయారు (బాలికలు – 9407, బాలురు – 2200)