భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్…
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు మే10వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000 వరకు జీతం చెల్లిస్తారు.
* ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే24న తేదీన ప్రారంభమై జూన్ 23తో ముగియనుంది.
* ఇంటర్వ్యూలను జులై రెండో వారంలో నిర్వహిస్తారు.