ఐపీఎల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. కానీ ఆ టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. 2016లో ఫైనల్ వరకు చేరినా సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఒక ఇంటర్వ్యూలో అతనికి వింత ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీకి ఆర్సీబీ కెప్టెన్సీ ఇచ్చి ఉంటే ఏమైఉండేదని అడిగారు. ఆ ప్రశ్న వినగానే ఆర్సీబీ కనీసం మూడు, నాలుగు ట్రోఫీలు గెలిచి ఉండేదని తడుముకోకుండా సమాధానం చెప్పాడీ లెజెండరీ క్రికెటర్.
ధోనీ కనుక కెప్టెన్ అయ్యుంటే ఆర్సీబీ ఈజీగా మూడు సార్లు ట్రోఫీ నెగ్గి ఉండేది. ఆ టీంకు చాలా సపోర్ట్ ఉంది. మోడర్న్ క్రికెట్లో టాప్ ప్లేయర్ అయిన విరాట్ కూడా ఆర్సీబీలో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. ఒకవేళ ధోనీ కనుక ఆ టీంలో ఉండి ఉంటే.. ట్రోఫీ నెగ్గడంలో చాలా హెల్ప్ చేసేవాడు’ అని అభిప్రాయపడ్డాడు.అదే సమయంలో మిగతా కెప్టెన్లతో పోలిస్తే ధోనీ నాయకత్వంలో ఉన్న భిన్నత్వాన్ని కూడా అక్రమ్ వివరించాడు. బయటకు ధోనీ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడని, తన ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ నింపుతాడని చెప్పాడు. దీంతో వాళ్లు మైదానంలో అద్భుతంగా ఆడతారని కొనియాడాడు. ధోనీకి కెప్టెన్సీ అనేది ఒకఅలవాటైపోయిందని అన్నాడు
కోహ్లీకి కూడా ఇప్పటికి కెప్టెన్సీఅలవాటుఅయిపోయి ఉండాలి. కానీ ధోనీకి అదే అలవాటు. తను లోపల కామ్‌గా ఉండడు. కానీ బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. తమ కెప్టెన్ చాలా చిల్‌గా ఉంటూ.. తమ భుజంపై చెయ్యేసి మాట్లాడుతుంటే ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. తన ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ నింపడం తెలిసిన కెప్టెన్ ధోనీ’ అని కొనియాడాడు