Today Gold Rates | బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది. దీంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు.గోల్డ్ ప్రియులకు తీపికబురు. బంగారం ధరలు దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. పుత్తడి వెలవెలబోతోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు నేడు దిగి వచ్చింది. అమెరికా ఫెడ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పడిపోవడం గమనార్హం. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా పసిడి రేటు పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు.బంగారం ధర పది గ్రాములకు రూ. 21 మేర దిగి వచ్చింది. దీంతో మార్నింగ్ ట్రేడింగ్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 59,743కు తగ్గింది. బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 61,371 నుంచి చూస్తే.. పసిడి రేటు దాదాపు రూ. 1600 పతనమైందని చెప్పుకోవచ్చు.అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు కూడా పడిపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర కేజీకి రూ. 74,053కు దిగి వచ్చింది. అంటే నేడు బంగారం, వెండి ధరలు రెండూ దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. వెండి కూడా పడిపోయింది.ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. అమెరికా ఫెడరల్ రిజర్వు ఫెడ్ రేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చనే అంచనాల నడుమ బంగారం ధర తగ్గిందని పేర్కొన్నారు. రేటు పెంపు అంచనాల నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడుతోందని తెలిపారు.అందువల్ల బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడిందని అనూజ్ గుప్తా తెలిపారు. దీని వల్ల బంగారం ధరలు ఔన్స్‌కు 2 వేల డాలర్ల కిందకు వచ్చాయని పేర్కొన్నారు. బంగారం ధర ర్యాలీ తర్వాత కొన్ని రోజులు రేంజ్ బౌండ్ ఉండొచ్చని తెలిపారు. తర్వాత మళ్లీ ర్యాలీ కొనసాగవచ్చని అంచనా వేశారు.అయితే అమెరికా ఫెడ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదు కావొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2010 డాలర్ల పైకి చేరితేనే తదుపరి ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.బంగారం ధరకు 1975 డాలర్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశీ మార్కెట్లో చూస్తే.. పది గ్రాముల బంగారం ధరకు రూ. 59,500 వద్ద మద్దతు ఉందన్నారు. అలాగే రూ. 58,500 వద్ద కూడా మద్దతు ఉందని పేర్కొన్నారు.కాగా హైదరాబాద్ మార్కెట్లో మే 2న బంగారం ధరలను గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 60,760 వద్ద కొనసాగుతోంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 వద్ద ఉంది. ఇక వెండి రేటు రూ. 80,500 వద్ద ఉంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!