ప్రైవేట్ వైద్యుల తీరుతో ప్రజల్లో ఆందోళన
నిజామాబాద్,ఏప్రిల్27(ఆంధ్రపత్రిక): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా గ్రావిూణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపిలు ప్రజల ప్రాణాలదీమదకు తెస్తున్నారు. తమకు తోచిన విధంగా ప్రైవేట్ డాక్టర్లు దందాలకు తెరలేపారు. వేలాది రూపాయలు వైద్యం పేరిట దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్తప్రుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం చెబుతోంది. ఈ దశలో జిల్లాల్లో కూడా ఆస్పత్రుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా నిర్వహిస్తున్న క్లినిక్లపై జిల్లా వైద్యాధికారులు గతంలో ఓమారు మెరుపుదాడులు చేశారు. పలువురు ఆర్ఎంపీలు దవాఖానలు ఏర్పాటు చేసి వైద్యం చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా క్లినిక్లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఆర్ఎంపీలు ప్రభుత్వ అనుమతులు పొందకుండానే వైద్యశాలలు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్యానికి గురై వారి వద్దకు వెళ్తే రోగులను భయాందో ళనకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా పలు టెస్టులు చేయిస్తున్నారు. మందులు అంటగడుతున్నారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నావని అధికారులు పలుచోట్ల గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైద్యశాలలు, ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!