ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఒక రకంగా ఇది మంచి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. అతను చివరగా 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక మోహిత్ శర్మ అనగానే తొలుత గుర్తుకు వచ్చేది 2013 ఐపీఎల్ సీజన్. ఆ సీజన్లో సీఎస్కే తరపున 15 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ 23 వికెట్లు పడగొట్టాడు. 2013లో సీఎస్కే రన్నరప్‌గా నిలిచినప్పటికి మోహిత్ శర్మ మాత్రం ధోని నమ్మిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2015 వరకుసీఎస్కేకు ఆడిన మోహిత్ 2016-18 వరకు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ తర్వాత 2018, 2019లో జరిగిన వేలంలో మళ్లీ సీఎస్కేనే దక్కించుకుంది. ఆ తర్వాత 2020 ఐపీఎల్ వేలంలో మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2022 ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్ నెట్ బౌలర్‌గా తీసుకుంది. ఇక 2023 మినీ వేలంలో మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఓవరాల్‌గా ఐపీఎల్ 88 మ్యాచ్‌లాడిన మోహిత్ శర్మ 122 వికెట్లు పడగొట్టాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మోహిత్ శర్మ టీమిండియా తరపున 26 వన్డేల్లో 31 వికెట్లు, 4 టి20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.